Dil Raju: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వివాదం రోజురోకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇక ఈ వివాదాలపై చిత్ర బృందం తమదైన రీతిలో సమాధానాలు చెప్తూ అభిమానులను శాంతి పర్చాలని చూస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఆదిపురుష్ 3డి టీజర్ ను రిలీజ్ చేశారు. పెద్ద స్క్రీన్ లో, 3డి లో ఆదిపురుష్ టీజర్ చాలాబావుందని మీడియా మిత్రులు తెలుపుతున్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ కు టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు హాజరయ్యాడు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ” టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఫోన్ లో చూశాను. అప్పుడే ప్రభాస్ కు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను.. ఆ తరువాత ఇంటికెళ్లి టీవీ లో చూసాను అప్పుడో ఇంకా బాగా అనిపించింది.. ఇప్పుడు బిగ్ స్రీన్ పై 3డి లో చూసాను. ఇది ఇంకా అద్భుతంగా అనిపించింది. ప్రభాస్ ను, సినిమాను ట్రోల్స్ చేస్తున్నారు. దానిపై నేను ఒకటే చెప్తున్నాను బాహుబలి సినిమా చూసినప్పుడు ప్రభాస్ శివ లింగంఎత్తితే ఆ ప్లేస్ లో జెండు బామ్ పెట్టి మొదటి రెండు రోజులు ట్రోల్ చేశారు. కానీ, నేను సినిమా చూసిన నైట్ ప్రభాస్ కు ఫోన్ చేసి చెప్పా.. సూపర్ హిట్ ప్రభాస్ అని.. అది కాదు ఇలా అంటున్నారు అని ప్రభాస్ అన్నా.. ఏ అవేమి లేదు తడిబట్ట వేసుకొని పడుకో అని చెప్పాను. ఇదొక అనుభవం.. ఫోన్ లలో చూసి, ఎక్కడో చూసి సినిమాను అంచనా వేయలేం. ఇవన్నీ బిగ్ స్క్రీన్స్ సినిమాలు.. థియేటర్ లో అందరితో పాటు చూసినప్పుడే ఆ సినిమా ఏంటి అనేది తెలుస్తోంది. ఆదిపురుష్ కూడా అలాంటి సినిమానే.. రామాయణం నుంచి డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో ఆ కథ ఎంతో అద్భుతంగా ఉంది.. అందులో ఉన్నది ప్రేక్షకులకు చూపించాలని వారు ఎంతో కష్టపడ్డారు.
ఇక దీనిపైనా కూడా డిస్కషన్స్.. రావణుడు ఇలా ఉంటాడా..? రావణుడు పక్షి మీద ఎందుకు వస్తాడు.. పూల రధం మీద రావాలి కదా..అని.. వాళ్లు సినిమా ఐడియా తీసుకొని ఈరోజు ప్రేక్షకులకు సినిమాను ఏమి చూపించాలి అనేదాని మీద వారి అనుభవం వారికి ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కాబోతుంది అందులో నాకెలాంటి డౌట్ లేదు. తానాజీ సినిమా చూసాకా నేను ఓం రౌత్ కు ఫ్యాన్ అయిపోయాను. అప్పటివరకు ఓం రౌత్ ఎవరో కూడా నాకు తెలియదు.. ఇక ఈ సినిమాను మన హిస్టరీలో న నుంచి తీసుకొచ్చారు కాబట్టి ప్రేక్షకులు ఎవరు డిస్పాయింట్ అవ్వరు. మొదటి రోజు నెగెటివ్ కామెంట్స్ కామన్.. ఎందుకంటే లక్ష మంది వేరే వేరే మైండ్ సెట్ లతో వచ్చి కూర్చొని సినిమా చూస్తారు.. ఆ ఏముంటుందిలే అని నెగెటివ్ మైండ్ తో వస్తారు. ఈ సినిమా అనే కాదు ప్రతి సినిమాకు మొదటి రోజు నెగెటివ్ వైబ్స్ అనేవి కామన్. ఉదాహరణకు పొన్నియిన్ సెల్వన్.. మొదటి రోజు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా ఈరోజు తమిళ్ నాడు లో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఆల్ టైమ్ రికార్డు సాధించబోతుంది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమాలు కావాలి. ప్రభాస్ లాంటి స్టార్ ఉన్నాకా ఈ సినిమా ఇక ఎందుకు ఆగుతోంది. జనవరి 12 న ఈ సినిమా చరిత్రను సృష్టిస్తోంది”అని చెప్పుకొచ్చాడు.