చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం పవన్ కళ్యాణ్ రోడ్డులోకి వెళ్లి పోతారు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే ఈరోజు ఈజనసేన అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందుగానీ.. రాసే ముందుగానీ ఒక సెకెండ్ ఆలోచించండి అంటూ తెలిపారు.
GodFather-Bisleri: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిస్లెరీ వాటర్ బాటిళ్లపై ఆ మూవీ బొమ్మతో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిస్లెరీ ప్రతినిధి తుషార్ మల్హోత్రా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో వాటర్ బాటిళ్లపై గాడ్‌ఫాదర్ బొమ్మ గల లేబుళ్లను అతికించి అందుబాటులో ఉంచనున్నారు.
God Father:'హనుమాన్ జంక్షన్' మూవీ కోసం దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా! మళ్ళీ ఇంతకాలానికి అతనో తెలుగు సినిమాను డైరెక్ట్ చేశాడు.