Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaganti Koteswara Rao: చాగంటి కోటేశ్వరరావు గురించి తెలియని వారుండరు. ఆయన ప్రవచనాలంటే అందరికీ ప్రీతి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సనాతన ధర్మంపురాణాలు, ఆధ్యాత్మికతపై అద్భుతమైన ప్రవచనాలు ఇచ్చే ప్రముఖ తెలుగు ప్రవచనకర్త. మానవ విలువలుకుటుంబ వ్యవస్థ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేలా ఆయన బోధనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నైతిక విలువల సలహాదారుగా సైతం సేవలందిస్తున్నారు. అయితే.. ఇటీవల చాగంటి ఓ ప్రవచనంలో ఓ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో కొన్ని ఛానెల్స్ వీవ్స్ సాధించడానికి రకరకాలుగా థంబ్ నెయిల్స్ పెడుతుంటాయి. అయితే.. చాగంటి కొడుకుపై సైతం ఇటీవల ఓ థంబ్ నెయిల్ అలాగే పెట్టారట. అది చూసిన ఆయన మెదట ఎంతో టెన్షన్ పడ్డారట. చివరికి వీడియోలో ఏమీ లేదని గ్రహించారట.
READ MORE: TTD Budget 2026: రూ.5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్.. శ్రీవారి ఆదాయం ఎన్ని కోట్లు అంటే..!
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
ఈ అంశంపై ఇటీవల చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ… ” నేను యూట్యూబ్‌లో “చాగంటి కొడుకు విషయంలో బయటపడిన భయంకరమైన నిజం.. వాళ్ల కోడలు బయటపెట్టిన వైనం..” అనే థంబ్‌నెయిల్ చూసి మొదట హడలి పోయాను. ఎప్పుడూ ఇంత అణకువగా ఉంటాడు. అంత మంచిగా ఉంటాడు. వీడు ఏం చేశాడు? నా కోడలు ఎందుకు బయట పెట్టింది? అసలు ఏం జరిగింది మా ఇంట్లో? అని నాకు చెమటలు పట్టేశాయి. మా కుటుంబం మీద గౌరవమే పోయిందే.. వీడు ఏం చేశాడు అనుకుని వీడియో ఓపెన్ చేసి చూశాను. ఆ పది నిముషాల వీడియోలో ఏమీ లేదు. ఆ హెడ్డింగ్ అలా ఉంది కాబట్టే.. చాగంటి కోటేశ్వరావు కొడుకు ఏదో చేశాడని ఈ వీడియోను జనాలు చూశారు. మీరు రామాయణం తెలుసుకోకపోయిన పర్వాలేదు. భారతం తెలుసుకోకపోయినా పర్వలేదు. మహాత్మా గాంధీ గురించి తెలుసుకోకపోయినా పర్వలేదు. కానీ చాంగంటి కోటేశ్వరరావు కోడలు ఏదో చెప్పిందట. అది చూడాలని వీడియో చూస్తున్నారు. ఈ వీడియోను ఎన్ని లక్షల మంది చూస్తే అంత డబ్బు వాడికి కావాలి. అది ఉచ్ఛమా? నీశ్చమా? దాని కన్న అడుక్కుతినడం మంచిది.. ఇటు వంటి తప్పుడు పనులు చేసి మనం డబ్బులు సంపాధించకూడదన్న నైతిక విలువలు వాళ్లకు ఉండవు. అందరినీ నేను అనడం లేదు. కొంత కొంత మంది యూట్యూబ్‌లో అలపెడతారు.” అంటూ చాగంటి ఫైర్ అయ్యారు.
READ MORE: Ranji Trophy 2026 Final: జమ్మూకాశ్మీర్ సంచలనం.. 67 ఏళ్ల తర్వాత మొదటిసారి రంజీ ట్రోఫీ కైవసం
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..