మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పాన్ ఇండియా మూవీ “కురుప్” విడుదల రోజే వివాదంలో చిక్కుకుంది. ఈరోజు అంటే నవంబర్ 12న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రంపై కేరళలోని కొచ్చికి చెందిన ఒక నివాసి కేసు దాఖలు చేశారు. పిల్ ప్రకారం ఈ చిత్రం నేరస్థుడు సుకుమార కురుప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కాబట్టి సుకుమార కురుప్ గోప్యతను ఉల్లంఘించే అవకాశం ఉంది అనేది సదరు వ్యక్తి వాదన. ఈ పిల్‌పై స్పందించిన కేరళ హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించలేదు. కానీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌పోల్, చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Read Also : మళ్ళీ అదే బాటలో వెంకీ మామ !!
వేఫేరర్ ఫిల్మ్స్, ఎం స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లపై 35 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది ‘కురుప్’. ఈ చిత్రానికి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ప్రధాన పాత్రను పోషించాడు. ఈ సినిమా నిర్మాణానికి ఆరు నెలల సమయం పట్టింది. ఈ సినిమాని కేరళ, ముంబై, దుబాయ్, మంగళూరు, మైసూర్, అహ్మదాబాద్‌లలో 105 రోజుల పాటు చిత్రీకరించారు. ఈద్ సమయంలోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైంది. జితిన్ కె జోస్ కథను అందించగా, డేనియల్ సయూజ్ నాయర్, కెఎస్ అరవింద్ స్క్రీన్ ప్లే రాశారు.