బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. ఇక భోజన ప్రియులను మరింత ఆకట్టుకొనేందుకు హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు కూడా వింత ప్రయోగాలు చేస్తున్నారు. నాన్ వెజ్ ప్రియుల కోసం రకరకాల కొత్త వంటలను పరిచయం చెయ్యడమే కాదు.. బిర్యానిని కొత్త విధానాన్ని కూడా ఎంచుకుంటున్నారు.. అవి వింతగా ఉండటమో, రుచిగా ఉండటామో తెలియదు కానీ చాలా మంది ఇష్టంగా వాటి కోసం జనం ఎంత దూరం అయిన వెళ్తున్నారు.. అయితే ఇప్పటివరకు కుండ బిర్యానీ ని అందరు తినే ఉంటారు.. కానీ ఇటుకలో బిర్యానీ అంటే పేరు ఎప్పుడైనా విన్నారా.. అవును మీరు విన్నది నిజం.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ..
సాదారణంగా చికెన్ బిర్యానీ అనగానే అందరి నోరు ఊరుతుంది. నాన్ వెజిటేరియన్స్ లొట్టలేసుకుని తినే ఆహార పదార్ధాలలో బిర్యానీ ముందు ప్లేసులో ఉంటుంది. ఇక హైదరాబాద్ బిర్యానీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫేమస్ అనుకోవాలి. కొత్తవారు ఒక్కసారి దీనిని రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అకేషన్ ఏదైనా, ఇంటికి ఎవరు వచ్చినా, ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాలన్నా బిర్యానీ ఉడకాల్సిందే.
అయితే మనం ఇప్పటి వరకు దమ్ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ, కుండ బిర్యానీ, బకెట్ బిర్యానీని చూసాము. ఇప్పుడు కొత్తగా బ్రిక్ బిర్యాని అని కొత్తగా ఒకటి వచ్చింది.. ఇటుకలో బిర్యానీ చేస్తారు. అదే ఈ డిష్ స్పెషాలిటీ మరి. ఇటుకతో తయారు చేసిన ఓ రెక్టాంగిల్ పాత్ర తీసుకుని అడుగున నెయ్యి రాసి, బిర్యానీకి అవసరమైన అన్ని ఇంగ్రేడియంట్స్‌ను వేసి మూత పెట్టి ఉడికిస్తే ఆ టేస్ట్ వేరే లెవల్.. ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే కొంపల్లి లోనే.. దీని ధర కూడా తక్కువే… ఒక్కొక్కటి కేవలం రూ.189 రూపాయలు మాత్రమే.. మీరు కూడా అటు వెళితే ట్రై చెయ్యండి..