YVS Chowdary: గురువుకు తగ్గ శిష్యుడు.. వైవిఎస్ చౌదరి బర్త్ డే స్పెషల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ రంగంలోనైనా ప్రఖ్యాతి గాంచిన వారివద్ద పనిచేసి, వారికి తగిన శిష్యులు అనిపించుకోవడం అంత సులువు కాదు. తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే – ‘గురువు గారు’ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావే! ఆయన శిష్యప్రశిష్యులు తెలుగు చిత్రసీమలో రాణిస్తున్నారు. అదే తీరున ఆయన సమకాలికులైన కె.రాఘవేంద్రరావు శిష్యగణం కూడా తెలుగు సినిమా రంగంలో అలరిస్తూనే ఉన్నారు. రాఘవేంద్రుని శిష్యుల్లో ఎందరో జైత్రయాత్రలు చేశారు. గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. వారిలో వైవిఎస్ చౌదరితో ఆయనది ప్రత్యేకబంధం! ఎలాగంటే రాఘవేంద్రరావు, వైవిఎస్ చౌదరి ఇద్దరి బర్త్ డే మే 23న కావడం విశేషం! గురువు రాఘవేంద్రరావు లాగే పాటల చిత్రీకరణలో చౌదరి సైతం తనదైన బాణీ పలికించాడు.
నటరత్న యన్టీఆర్ కు వీరాభిమాని వైవిఎస్ చౌదరి. బాల్యం నుంచీ రామారావు చిత్రాలు చూస్తూ పెరిగిన చౌదరి చదువులోనూ చురుకైనవాడు. ర్యాంక్ స్టూడెంట్. అయితే ఇంజనీరింగ్ చేయాలనుకున్న చౌదరి మనసును సినిమా రంగం పట్టేసింది. తన అభిమాన నటుడు యన్టీఆర్ తో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన కె.రాఘవేంద్రరావును ఎంతగానో అభిమానించేవారు వైవిఎస్. దాంతో మద్రాసు వెళ్ళి రాఘవేంద్రరావును కలసి, ఆయన వద్ద అసోసియేట్ గా పనిచేస్తానని కోరారు. అప్పటికే రాఘవేంద్రరావు వద్ద 17 మంది అసోసియేట్స్ ఉన్నారు. అందువల్ల తరువాత చూద్దాం లే అన్నారు రాఘవేంద్రరావు. అయితే వైవిఎస్ మాత్రం పట్టువదలని విక్రమార్కునిలా పదమూడు రోజులు రాఘవేంద్రరావు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కరుణించిన రాఘవేంద్రరావు, చౌదరి దస్తూరీ పరీక్షించారు. చౌదరి చేతిరాత చూసి, తన వద్ద సహాయ దర్శకునిగా స్థానం కల్పించారు. చిత్రమేంటంటే, యన్టీఆర్ కు వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి, రామారావు తనయులు నిర్మించిన సొంత చిత్రం ‘పట్టాభిషేకం’ ద్వారా అసోసియేట్ గా చేరాడు. ఆ తరువాత రాఘవేంద్రరావు వద్ద పలు చిత్రాలకు అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా పనిచేశారు చౌదరి.
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
చదువుకొనే రోజుల్లో యన్టీఆర్ ను వీరలెవెల్లో అభిమానిస్తూ, ఏయన్నార్ ను ద్వేషించిన చౌదరికి, అక్కినేని తనయుడు నాగార్జున దర్శకునిగా అవకాశం కల్పించారు. ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రం ద్వారా వైవిఎస్ చౌదరిని దర్శకునిగా పరిచయం చేశారు నాగార్జున. మరింత విశేషమేమంటే, చౌదరి తన తొలి చిత్రంలోనే ఏయన్నార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. చిత్రసీమలోకి వచ్చాక యన్టీఆర్, ఏయన్నార్ మధ్య ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్న చౌదరి, ఆ ఇద్దరు మహానటుల వారసులు హరికృష్ణ, నాగార్జునతో ‘సీతారామరాజు’ చిత్రం తెరకెక్కించి అలరించారు. కృష్ణ నటవారసుడు మహేశ్ తో ‘యువరాజు’ తీసి ఆకట్టుకున్నారు. నందమూరి హరికృష్ణను హీరోని చేసి “లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య” చిత్రాలు తెరకెక్కించి మంచి విజయం సాధించారు. రామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘దేవదాస్’ రూపొందించారు. ఈ సినిమా డైరెక్టుగా 200 రోజులు ప్రదర్శితమై జనాన్ని ఎంతగానో అలరించింది. ఇలా తన చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసిన చౌదరి ఇప్పుడు మునుపటిలా సినిమాలు రూపొందించడం లేదు. ఆ పై ఆయన రూపొందించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మళ్ళీ వైవిఎస్ చౌదరి తన చిత్రాలతో అలరిస్తారని ఆయనను అభిమానించేవారు భావిస్తున్నారు. మరి అదెప్పుడో చూడాలి!
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
-
Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
-
YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!