Karnataka polls: యడియూరప్ప ఒత్తిడిలో మాట్లాడుతున్నారు.. మాజీ సీఎంపై షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని పిలుపునిచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం బిఎస్ యడియూరప్పపై జగదీష్ షెట్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఒత్తిడి మేరకు యడియూరప్ప ఈ మాటలు చెబుతున్నారని షెట్టర్ అన్నారు. హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుండి జగదీష్ షెట్టర్ గెలవకుండా ఉండటానికి బిజెపి నాయకులందరూ చాలా కష్టపడతారని యడియూరప్ప చెప్పగా, బిజెపి తన కుమారుడు విజయేంద్రకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే యడియూరప్ప అలాంటి ప్రకటన చేసి ఉండేవారు కాదని శెట్టర్ పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా యడియూరప్పను కలిశానని, తనకు టిక్కెట్ ఇవ్వాలని, లేకపోతే ఉత్తర కర్ణాటకలో పార్టీ 20-25 సీట్లు కోల్పోతుందని పార్టీ హైకమాండ్‌ను చెప్పినట్లు తెలిపారు. పార్టీ ఒత్తిడి వల్లే ఆయన మాట్లాడుతున్నారని షెట్టర్ అన్నారు.
Also Read:Heavy Rain Hits Hyderabad Live: హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం
హుబ్లీలో విలేకరులతో యడియూరప్ప మాట్లాడుతూ.. ”ఈ ఎన్నికల్లో మా ప్రజలకు షెట్టర్‌ను గెలిపించకూడదని.. మా అభ్యర్థిని గెలిపించాలని నేను చెప్పాను. ఇక్కడ భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తాం. షెట్టర్ గెలవకుండా ఉండేందుకు మేం చాలా కష్టపడతాం.ఈ నియోజకవర్గంలో షెట్టర్ గెలవకుండా చూస్తామని మా నాయకులందరూ ప్రమాణం చేశారు” అని చెప్పారు. జగదీష్ శెట్టర్ సొంత నియోజకవర్గం అయిన హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేశ్ టెంగింకైని పోటీకి దింపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షికారిపుర నుంచి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను బీజేపీ పోటీకి దింపింది. దశాబ్దాలుగా తన తండ్రికి పట్టున్న నియోజకవర్గం నుంచి విజయేంద్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
బీజేపీ టికెట్ ఆశించిన జగదీశ్ షెట్టర్‌కు పార్టీ నాయకత్వం పోటీ చేసే అవకాశం కల్పించలేదు. తొలి జాబితాలో పేరు లేకపోవడంతో ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. టికెట్ కోసం అభ్యర్థించారు. అయితే, బీజేపీ రెండో అభ్యర్థుల జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో షెట్టర్ అవమానంగా భావించారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి తన సొంత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అంతే కాదు పార్టీ తరుపున ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. షెట్టర్ పార్టీ మారడంతో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read:Yogi Death Threat: ప్రియురాలి తండ్రి ఫోన్‌తో కుట్ర.. యోగిని చంపేస్తానన్న వ్యక్తి అరెస్ట్
తాజావార్తలు
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
-
Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్ప్లే, Core Ultra ప్రాసెసర్
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!