Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Woman From Japan Was Groped Harassed In Delhi During Holi Celebrations

Holi Harassment: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు

Published Date :March 10, 2023 , 6:05 pm
By NTV WebDesk
Holi Harassment: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీలో బుధవారం హోలీ వేడుకల సందర్భంగా జపాన్‌కు చెందిన ఓ యువతిపై కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. కొందరు వ్యక్తులు ఆమెని పట్టుకుని వేధించి, అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తీవ్ర దుమారం రేగింది. హోలీ హై అంటూ బాధిత యువతిని పట్టుకోవడం, ఆమెపై రంగులు జల్లడం చేశారు. ఒక బాలుడు ఆమె తలపై గుడ్డు పగులగొట్టాడు. దీంతో బాధితురాలు ఆ గుంపు నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఆమె చెంపదెబ్బ కొట్టింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Delhi liquor policy case: ఈడీ కస్టడికి మనీశ్ సిసోడియా

ఈ ఘటన పహర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కొత్తదా లేదా పాతదా అన్నదానిపై విచారణ చేస్తున్నారు. యువతికి సంబంధించిన మరేదైనా వివరాల కోసం జపాన్ రాయబార కార్యాలయానికి ఈ-మెయిల్ పంపించామని పోలీసులు చెప్పారు. వీడియోలో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు. వీడియో నిజమే అయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, హోలీ పండుగని ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో బుధవారం జరుపుకున్నారు. చాలా రాష్ట్రాలు ముందురోజు హోలీని జరుపుకున్నాయి.

Also Read: TV Rama Rao Resigns YSRCP: వైసీపీకి షాక్..! పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • harassed
  • Holi Celebrations
  • Japan
  • Woman

తాజావార్తలు

  • Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..

  • Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

  • War Effect : నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోన్న యుద్ధ సంక్షోభం

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బ తీసిన మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్..

  • Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions