What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం కాన్పూర్ స్నాతకోత్సవంలో మోడీ పాల్గొంటారు.
- నేడు హర్యానా కేబినెట్ విస్తరణ చేయనున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నూతన మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనుంది.
- నేడు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఆయిల్ ఫామ్ బిజినెస్ సమ్మిట్ జరుగనుంది. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరుగనున్న ఈ ఆయిల్ ఫామ్ సమ్మిట్ కు 9 రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు హజరుకానున్నారు. ఆయిల్ సాగు, ఎగుమతిపై సమ్మిట్‌లో చర్చించనున్నారు.
- నేడు హైదరాబాద్‌లో సచివాలయం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో 317తో స్థానికతను కోల్పోయిన టీచర్లను సొంత జిల్లాలకు పంపాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
- ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు, సినిమా థియేటర్ల మూసివేత జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు. సినిమా థియేటర్ల మూసివేత, టికెట్ ధరలపై ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేశారు.
- నేడు శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి, ఫిబ్రవరి కోటా టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు, జనవరి 14 నుంచి 22 వరకు రోజుకు 2 వేల చొప్పున లఘు దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
- నేడు ఉదయం 11.30 గంటలకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం నిర్వహించనుంది. వర్చువల్ విధానంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్, మూడో డోసు వ్యాక్సిన్ పంపిణీపై చర్చించనున్నారు.
- తెలంగాణలో నేటి నుంచి యాసంగి రైతుబంధు నిధులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరునుంది. రైతుల ఖాతాల్లో రూ.7645.66 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటివరకు రూ.50 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందించింది.
- నేడు అర్హులై సంక్షేమ పథకాల లబ్ధి పొందిన వారికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. 18.47 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.703 కోట్ల నగదును ప్రభుత్వం జమచేయనుంది.
- హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,590లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,450లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,000 లుగా ఉంది.
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
- Jaishankar-Rubio: హార్ముజ్‌లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్‌కు రూబియో సూచన
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
తాజావార్తలు
-
Iran vs America: అప్పుడు గులాబీలు.. ఇప్పుడు బాంబులు.. ప్రపంచాన్ని హత్తుకున్న ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఇదే!
-
ASUS Chromebook: మూడు క్రోమ్‌బుక్‌లను విడుదల చేసిన ఆసుస్.. స్క్రీన్‌ను విడదీసి టాబ్లెట్‌గా మార్చుకోవచ్చు.. తక్కువ ధరకే
-
CJP Protest: నేడు హైదరాబాద్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా.. సోనమ్ వాంగ్‌చుక్ హాజరు!
-
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
-
SURIYA : సూర్య 50.. కథ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!