What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. కొండపల్లిలోని 29 స్థానాలకు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ15, వైసీపీ14 స్థానాల్లో గెలుపొందింది. అయితే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసాభాసగా సాగడంతో.. టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది.
- ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5గంటలకు సీఎస్ సమీర్‌శర్మ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ రోజు పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
- శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గత నెల చివరిలో ప్రారంభమయ్యాయి. అయితే నేడు 20వ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. అయితే ఒకరోజు ముందుగానే శీతాకాల సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.
- కర్నూలు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే ఈ నెల 23, 24, 25 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.
- నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు ఈ ప్రో కబడ్డీ లీగ్ జరుగనుంది. అయితే ఈ సీజన్‌లో 12 జట్లు బరిలోకి దిగనున్నాయి. కరోనా దృష్ట్యా ప్రేక్షకులకు అనుమతిని నిర్వాహకులు నిరాకరించారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ బెంగళూరు బుల్స్-యు ముంబాయి మధ్య జరుగనుంది. అలాగే తరువాతి మ్యాచ్ 8.30 గంటలు తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ జట్టుల మధ్య పోరు జరుగనుంది. అనంతరం 9.30 గంటలకు బెంగాల్ వారియర్స్- యూపీ యోధ మధ్య మ్యాచ్ జరుగనుంది.
- నేడు నిర్మల్ జిల్లాలో వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర నిర్వహించనున్నారు. దిలావర్‌పూర్, సారంగాపూర్, మామడ మండలాల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.
- నేడు ఆర్థికవేత్తలతో నిర్మలాసీతారామన్ వర్చుల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రీ బడ్జెట్‌పై ఆర్థికశాఖ మంత్రి నిర్మాలసీతారామన్ సంప్రదింపులు జరుపనున్నారు.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,420లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 65,200లుగా ఉంది.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!