NTV Telugu Site icon

What Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు జంతర్ మతర్ దగ్గర బీసీ సంఘాల ఆందోళన.. ఉదయం 9.30 గంటలకి హాజరు కానున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

* నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. గత విచారణలో ముగిసిన బీఆర్ఎస్ వాదనలు.. నాలుగు వారాల్లోకా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై.. స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరిన బీఆర్ఎస్.. నేడు కొనసాగనున్న స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి సహా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు వాదనలు..

* నేడు టీటీడీపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు.. హాజరుకానున్న టీటీడీ ఛైర్మన్, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకటయ్య చౌదరి..

* నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం.. ఎంపీపీ, జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో భేటీకానున్న జగన్.. పార్టీ గెలుపునకు కృషి చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను స్వయంగా కలవనున్న జగన్..

* నేడు ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. ఎమ్మెల్సీలుగా బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, నాగాబాబు, సోమువీర్రాజు ప్రమాణస్వీకారం.. ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట మధ్యలో ప్రమాణస్వీకారం..

* నేటి నుంచి తిరుపతి తొక్కిసలాటపై నాల్గవ దశ విచారణ.. రెండు రోజుల పాటు కీలక విచారణ కొనసాగే అవకాశం..

* నేడు పెద్దాపురంలో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం.. ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్.. 20 ఎకరాల్లో రూ. 114.20 కోట్లతో నిర్మించిన బయో ఎనర్జీ ప్లాంట్..

* నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం.. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించే అవకాశం..

* నేడు సాయంత్రం ఏపీ సీఎస్ విజయానంద్ కీలక సమీక్ష.. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష..

* నేడు లోక్ సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఎంపీలకు విప్ జారీ బీజేపీ, కాంగ్రెస్.. నేటి నుంచి మూడు రోజుల పాటు హాజరుకావాలని విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..

* నేటి నుంచి మధురైలో సీపీఎం 24వ జాతీయ మహా నాడు.. హాజరుకానున్న తమ్మినేని, జాన్ వెస్లీ సహా వివిధ రాష్టాలకు చెందిన 820 మంది ప్రతినిధులు..

* నేడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు మ్యాచ్..