Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు అవిశ్వాస తీర్మానంపై పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో ఓటింగ్, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న ఇమ్రాన్‌ఖాన్‌

* తిరుమలలో నేటి నుంచి వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు పునరుద్ధరణ

* దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ రేపటి నుంచి బూస్టర్‌ డోస్

* నేటి నుంచి కడప జిల్లా ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. 10 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు

* మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కొనసాగుతోన్న సీఎం వైఎస్‌ జగన్‌ కసరత్తు.. ఇవాళ మరోసారి సజ్జలతో భేటీ అయ్యే అవకాశం… నిన్న దాదాపు 3 గంటల పాటు జరిగిన చర్చలు

* నేడు రాజమండ్రిలో అసాధారణంగా పెరిగిన నిర్మాణ రంగానికి చెందిన ముడిసరుకుల ధరలపై ఇంజనీర్లు, బిల్డర్లు ఎల్టిపిలు, కార్మిక సంఘాల నిరసన

* సత్యసాయి జిల్లా : గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామంలో నేటి నుంచి యోగి వేమన బ్రహ్మోత్సవాలు.

* అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండల కేంద్రంలో నేడు జల చైతన్యం కార్యక్రమం. పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

* విశాఖ: నేడు జిల్లాలో బీజేపీ జలం కోసం ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర.. పాల్గొననున్న సోము వీర్రాజు, సీఎం రమేష్, మేఘాద్రి గడ్డ రిజర్వాయర్, అనకాపల్లి దగ్గర గ్రోయిన్లు, మాడుగుల మండలంలో రిజర్వాయర్లు పరిశీలన, సాయంత్రం మాడుగుల మండల కేంద్రంలో బహిరంగ సభ

* నేడు భద్రాచలం రామాలయంలో రాముల వారికి ఎదుర్కోలు.. రేపు మిథిలా స్టేడియంలో సీతా రాముల కల్యాణం

Exit mobile version