What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- ధాన్యం కొనుగోలు విషయమై నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడో రోజు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని ప్రకటించడంతో సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్లారు.
- భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ప్రకారం నేటితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికీ టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు కూడా వారివారి నామినేషన్లను సమర్పించారు.
- వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసాయి దీంతో కడప, నెల్లూరు, అనంతరపురం, చిత్తూరు జిల్లా అతిభారీ వర్షాలు కురిసి పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో వరద బాధితులను కలువనున్నారు. రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు.
- సెంట్రల్ విస్టా పనులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కొత్త పార్లమెంట్ భవ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలనే పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ విస్టా పనులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
- కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎన్నిక నేడు జరుగనుంది. ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు 14చొప్పున గెలుపొందారు. అయితే టీడీపీ రెబల్ అభ్యర్థి గెలిచిన అనంతరం టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ సంఖ్య పెరిగింది. దీంతో ఎక్స్ అఫిషియో ఓట్లను కూడా కలుపుకుంటే వైసీపీకి 15, టీడీపీకి 16 స్థానాలు ఉన్నాయి.
- నేడు కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విశాఖపట్నంలో ఒక్కరోజు పర్యటించనున్నారు. బావికొండ బుద్ధిస్ట్ సర్క్యూట్ లో స్వదేశ్-2 టూరిజం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు.
- పుట్టపర్తి సత్యసాయి బాబా 96వ జయంతోత్సవం నేడు జరుగనుంది. ఈ నేపథ్యంలో ట్రస్టు సభ్యులు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వార్షిక నివేదకను వెల్లడించనున్నారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?