NTV Telugu Site icon

Lakhpati Didi: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వడ్డీ లేని రుణం.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Modi

Modi

మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన లఖ్‌పతి దీదీ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. సదస్సుకు చేరుకున్న ప్రధానికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ‘లఖ్‌పతి దీదీ’ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ తన మూడవ టర్మ్‌లో లఖ్‌పతి దీదీ హోదాను సాధించిన 11 లక్షల మందికి సర్టిఫికేట్‌లను పంపిణీ చేశారు.

READ MORE: PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి పాకిస్తాన్ ఆహ్వానం..!

48 లక్షల మంది సభ్యులతో 4.3 లక్షల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం చేకూర్చనున్న ఈ సదస్సులో ప్రధాని మోడీ రూ. 2,500 కోట్ల నిధిని కూడా ప్రకటించారు. ‘లఖపతి దీదీ’ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కోటి మంది మహిళలు ఈ కోవలో చేరారని ప్రభుత్వం చెబుతోంది. మూడు కోట్ల లఖ్‌పతి దీదీల‌ను సృష్టించ‌డం ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం స్వయం సహాయక సంఘంలోని సభ్యులకు ఏటా రూ. 1 లక్ష సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5,000 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను కూడా ప్రధాని పంపిణీ చేశారు. దీనివల్ల దేశంలోని 2.35 లక్షల స్వయం సహాయక సంఘాలలో 25 లక్షల మందికి పైగా సభ్యులు ప్రయోజనం పొందుతారు.

READ MORE:Pakistan: పాక్‌లో ఘోరం.. బస్సు కాలువలో పడి 29 మంది మృతి..

లఖ్‌పతి దీదీ యోజన అనేది మహిళలకు నైపుణ్య శిక్షణా కార్యక్రమం. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించగలిగేలా తీర్చిదిద్దారు. ఈ పథకం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు స్వయం ఉపాధి వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తుంది. లఖ్‌పతి దీదీ యోజన కింద మహిళలకు రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తారు. ఈ రుణంపై మహిళలు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే మహిళలు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ పథకం కింద వడ్డీ లేని రుణాన్ని తీసుకోవచ్చు. లఖపతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేయడానికి, మీరు తప్పనిసరిగా కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. ఇందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ రుజువు, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్ తదితర పత్రాలు అవసరం.