వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో లోకశ్ పై కోడిగుడ్డుతో దాడిచేశారు.. అయితే ఆ గుడ్డు లోకేష్ కు తగలకుండా పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తగిలాయి. దీంతో సెక్యూరిటీ అప్రమత్తం అయింది. ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో బహిరంగ సభ ముగించుకుని ఆర్టీసి బస్టాండ్ దాటి న తరువాత ఓ దుకాణం వద్ద ఆగి ప్రజలతో మాట్లాడుతుండగా గుడ్ల దాడి జరిగింది.. అయితే…
కడప జిల్లాలో పండుగ వేళ ప్లెక్సీ వివాదం అధికార పార్టీ నేతల మధ్య గొడవలను బయటపెట్టింది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. అది కాస్త పోలీస్ కంప్లైంట్ల వరకు వెళ్లింది. భోగి మంటలతో సంతోషంగా పండుగ జరుపుకోవాల్సిన సమయంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ప్లెక్సీ సెగలు పుట్టించింది. ఈనెల 16న జరగనున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టిన రోజు కోసం ఆయన అనుచరుడు…
ఎర్రచందనం దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా కడపజిల్లాలో నిన్న అర్ధరాత్రి ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు,40 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీల మధ్య ఛేజింగ్ జరిగింది. ఖాజీపేట మండలం నాగసాయిపల్లె చెక్ పోస్టు వద్ద నుండి ఐచర్ వాహనంలో ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు ప్రొద్దుటూరు ఫారెస్టు అధికారులు. ఫారెస్టు అధికారుల దాడిని తప్పించుకునేందుకు ప్రొద్దుటూరు వైపు ఐచర్ వాహనంలో పరారవుతూ వాహనంలో నుండి దూకి పారిపోయారు 45 మంది తమిళనాడు కూలీలు. బొజ్జవారిపల్లె…