రాజకీయంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ తీసుకొని గెలుపే లక్ష్యంగా బరిలో దిగాయి. అయితే ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొందనే టాక్ విన్పిస్తోంది. ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా సీన్ మారిపోవడంతో హుజూరాబాద్ లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ సైతం తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆయా పార్టీల తరుఫున కీలక నేతలు…