ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో ఓ హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా , పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే 12 మంది ఆటగాళ్లతో కూడిన తమ జట్టును ప్రకటించింది. కానీ భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఇక ఈ మ్యాచ్ పై అలాగే పాక్ జట్టుపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… పాకిస్థాన్ జట్టు చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు. అలాగే ఆ ఆజట్టులో గేమ్ చెంజర్స్ కూడా ఉన్నారు అని తెలిపాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే అన్ని విభాగాల్లో తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి అన్నాడు. ఇక ఈ మ్యాచ్ పై బయట అభిమానులో ఉత్కంఠ పై స్పందిస్తూ… ఇది కేవలం ఒక మాములు మ్యాచ్ మాత్రమే. మిగితా అన్ని జట్లతో మ్యాచ్ ఆడిన విధంగానే ఈ మ్యాచ్ కూడా మేము ఆడుతాం అని స్పష్టం చేసాడు. ఇక మేము మా జట్టును మ్యాచ్ ముందు ఆవరకు ప్రకటించాము అని తెలిపాడు. మా ఎంపిక పైన అలాగే వ్యూహాల పైన మాకు నామకమ్ ఉంది అని కోహ్లీ తెలిపాడు.