భారతదేశ అత్యున్నత సైనిక కమాండర్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదిక సమర్పించింది. లోక్‌సభకు ప్యానెల్ కమిటీ నివేదిక అందజేసింది. బిపిన్ రావత్ మృతికి పైలట్ తప్పిదమే కారణమని ప్యానెల్ కమిటీ తేల్చింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది.
భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ పూర్తయింది. ఈ సందర్భంగా విచారణ కమిటీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF)కు ప్రాథమిక నివేదిక అందజేసింది. ఈ ప్రమాదానికి మెకానికల్ ఫెయిల్యూర్, కుట్ర, నిర్లక్ష్యం కారణం కాదని నివేదిక స్పష్టం చేసింది. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్లే ప్రమాదం జరిగిందని.. కొండ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేయడంలో పైలట్ విఫలమయ్యాడని నివేదిక పేర్కొంది. Read Also: కేంద్ర పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎన్నిక కాగా గతేడాది…
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రమాదం పై హై లెవెల్ ఎంక్వైరీ కొనసాగుతోందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. వాతావరణ తప్పిదమా.. మానవ తప్పిదమా.. లేక సాంకేతిక లోపమా అనేది విచారణ చేస్తున్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రమాదం పై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్…
భారత్ ఓ నికార్సైన దేశభక్తుణ్ని కోల్పోయింది. దేశం కోసం నాలుగు దశాబ్దాలకు పైగా అనేక పోరాటాలు చేసిన వీరుణ్ని పోగొట్టుకుంది. చివరి రోజు వరకు విధినిర్వహణలోనే గడిపిన జనరల్ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు అసామాన్యం. 1978లో మొదలైన ఆయన కెరీర్ నేటివరకు అంచెలంచెలుగా ఎదగటంలో అకుంఠిత దీక్ష, అంతులేని క్రమశిక్షణ ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. 2019 డిసెంబర్ 30నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు.భారత్‌కు తొలి…
విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణాలు ఎప్పుడూ ప్రమాదమే. ఎంత అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోటే విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేస్తుంటారు. వీవీఐపీలు ప్రయాణం సమయంలో అధికారులు మరింత కేర్ తీసుకుంటారు. ప్రయాణం చేసే మార్గంలో తనీఖీలు, ల్యాండింగ్ వంటి వాటిని ట్రయల్స్ నిర్వహిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. దేశంలో అనేక మంది ప్రముఖులు…
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈరోజు కనూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి చెందినట్టు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. ఉటీ సమీపంలోని వెల్డింగ్టన్ డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సూలూరు ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి ఎంఐ 17 హెలికాప్టర్‌లో వెల్టింగ్టన్ కు బయలుదేరి వెళ్లారు. వెల్డింగ్టన్‌కు 16 కిలోమీటర్ల దూరంలో హఠాత్తుగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో…