కిచ్చా సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’. ఈ యాక్షన్ అడ్వంచర్ మూవీని 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదల చేయబోతున్నారు నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్. ఈ సినిమా విడుదల తేదీని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి 24వ తేదీ ఈ మూవీని గ్రాండ్ వే లో రిలీజ్ కాబోతోంది. సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషించిన ‘విక్రాంత్ రోణ’ను అనూప్ భండారి తెరకెక్కించాడు. బి. అజనీశ్ లోకనాథ్ సంగీతం అందించగా, విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. చీకటి సామ్రాజ్యానికి దేవుడిగా, అరి వర్గాల వెన్నులో చలిపుట్టించే ‘విక్రాంత్ రోణ’గా సుదీప్ నటించడం విశేషం.
ఇతర భాషల్లో ఈ సినిమాతో మరే చిత్రాలైనా పోటీ పడతాయో లేదో తెలియదు కానీ, తెలుగులో మాత్రం ఫిబ్రవరి 25న వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ విడుదల కాబోతోంది. సుదీప్ ‘విక్రాంత్ రోణ’ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ డ్రామా కాగా, ‘ఎఫ్ 3’ వినోదాల విందును వడ్డించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సో…. ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలూ భిన్నమైన అనుభూతులను అందించే ఆస్కారం ఉంది.
The World Gets A New Hero On Feb 24, 2022 #VikrantRonaOnFeb24 @anupsbhandari @JackManjunath @Asli_Jacqueline @nirupbhandari @AJANEESHB @neethaofficial @shaliniartss @Alankar_Pandian @Kichchacreatiin @ZeeStudios_ @TSeries @LahariMusic @VikrantRona #VikrantRona pic.twitter.com/V2hER6qFeb
— Kichcha Sudeepa (@KicchaSudeep) December 7, 2021