దక్షిణ చైనా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదగాలని చైనా చూస్తున్నది. దీనికోసం చుట్టుపక్కల దేశాలను బెదిరిస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే హాంకాంగ్, టిబెట్‌పై ఆధిపత్యం చలాయిస్తున్న చైనా, తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే అమెరికా అధికారులు తెలిపారు. హిమాలయ సరిహద్దుల్లో చైనా దురాక్రమణలకు పాల్పడుతూనే ఉందని చైనాలో కొత్తగా నియమితులైన సీనియర్ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని వియాత్నం, ఫిలిప్పిన్స్‌తో పాటుగా జపాన్, ఆస్ట్రేలియా, లిథేవేనియా దేశాలపై బెదిరింపులకు పాల్పడుతుందని నికోలస్ పేర్కొన్నారు. అమెరికా మిత్రదేశాలపై జరుగుతున్న దాడులకు చైనా బాధ్యత వహించాల్సి వస్తుందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నికోలస్ తెలిపారు.
Read: ఇండియా పాక్ మ్యాచ్‌కు వంద టికెట్లు ఫ్రీగా ఇచ్చిన వ్యాపారవేత్త…