ఒమిక్రాన్ టెన్షన్: 5 రోజుల్లో 12 వేల విమాన సర్వీసులు రద్దు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక దేశాలు ట్రావెలింగ్ పై ఆంక్షలు విధిస్తున్నాయి. చాలా దేశాలు విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల్లో విమాన సర్వీసులు నడుస్తున్నా ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, క్వారంటైన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం ఇండియా విమానయాన రంగంపై కూడా పడింది. దేశంలో గత కొన్ని రోజులుగా అనేక విమానాలు తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి.
Read: పీఆర్సీ ప్రాసెస్‌లో ఉంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు..!
Also Read
శుక్రవారం నుంచి ఈరోజు వరకు ఐదు రోజుల వ్యవధిలో సుమారు 12 వేలకు పైగా సర్వీసులు రద్దయినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో విమాన సర్వీసులకు భారీ డిమాండ్ ఉండేది. గతేడాది కరోనా, ఈ ఏడాది ఒమిక్రాన్ కారణంగా సర్వీసులు రద్దు చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులు కూడా రద్దవుతుండటంతో విమానయాన రంగం మరింత కష్టాల్లో పడిపోయే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!