NTV Telugu Site icon

టీఆర్‌ఎస్‌, బీజేపీలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయి : భట్టి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. కర్షకులకు అండగా కాంగ్రెస్‌ అంటూ కాంగ్రెస్‌ పార్టీ వరి దీక్షలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయని, కార్పొరేట్ లకు భూముల అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.

ఖమ్మం జిల్లాలో వరి రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యపు రాశులతో కల్లాలు నిండిపోయాయని, పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే యుద్ధం తప్పదంటున్న భట్టి విక్రమార్క హెచ్చరించారు.