భార‌త్‌లో మ‌రో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌…

దేశంలో విమాన‌యాన రంగం మ‌ళ్లీ పుంజుకుంటోంది.  క‌రోనా కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పౌర‌విమాన‌యానం తిరిగి గాడిలో ప‌డింది.  న‌ష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా స‌న్స్ ద‌క్కించుకున్నాక మ‌రిన్ని ప్రైవేట్ సంస్థ‌లు విమాన‌యాన రంగంలోకి ప్ర‌వేశించేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి.  ఇందులో భాగంగా ఇప్పుడు ఆకాశ ఎయిర్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ త్వ‌ర‌లోనే భార‌త్‌లో విమానాలు న‌డ‌ప‌బోతున్న‌ది.  ఆకాశ ఎయిర్‌కు భార‌త ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  ఈ విమానాయాన సంస్థ‌కు పౌర‌విమాన‌యాన శాఖ నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.  2022 వేస‌వి నుంచి ఆకాశ ఎయిర్ విమానాలు త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభించే అవ‌కాశం ఉన్న‌ది.  ఇన్వెస్ట్‌మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఈ సంస్థ‌లో పెట్టుబ‌డులు పెట్టారు.  ఆయ‌న‌తో పాటుగా ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్యా ఘోష్‌కూడా ఈ సంస్థ‌లో పెట్టుబ‌డులు పెట్టారు.  వ‌చ్చే నాలుగేళ్లలో 70 విమానాలు న‌డిపేందుకు ఆకాశా ఎయిర్ సంస్థ ప్లాన్ చేస్తున్న‌ది.  

Read: ఆ బిల్లుపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గిందా?

-Advertisement-భార‌త్‌లో మ‌రో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌...

Related Articles

Latest Articles