బీజేపీ వాళ్లకు ఏమైనా బుద్ది ఉందా? రేవంత్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ కి రాజకీయ ప్రయోజనాల కంటే..రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. కెసిఆర్ రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థ కి కేంద్రం ఆమోదం తో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది. జీఓ 317తో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీఓ ఉందన్నారు రేవంత్.
స్థానికత కోల్పోకుండా ఉద్యోగ కల్పన ఉండాలి. నాలుగు లక్షల మంది ఉద్యోగులలో చిచ్చు పెట్టారు. ఉద్యోగుల్లో కొందరిని తన వైపు తిప్పుకునే ఆలోచన లో నే జీఓ 317 వుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్న ఉద్యోగుల్లో చీలిక తెచ్చి…ఒక వర్గాన్ని అనుకూలంగా మలుచుకున్నారు. బండి సంజయ్..క్యాంప్ ఆఫీస్ దీక్ష చేస్తారు అంటారు. జాగరణ అంటే.. నైట్ క్యాంప్ ఆఫీస్ లో పడుకుని పొద్దుగాల ఇంటికి పోతా అన్నాడు. అదేదో పెద్ద సమస్య అన్నట్టు.. రాష్ట్ర ప్రభుత్వం కట్టర్లు.. గ్యాస్ ప్రయోగించింది.
Also Read
- G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
- DK.Shivakumar: రేపే సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణం.. కేబినెట్లో వీరికి బెర్త్ కన్ఫాం!
అరెస్ట్ చేసి 48 గంటల్లో సమస్య ముగిసింది. బీజేపీ నేతలు గంగిరెద్దుల వాళ్ళు లెక్క వచ్చిపోతున్నారు. కార్గిల్ వీరున్ని ముద్దాడినట్టు సంజయ్ ని బీజేపీ ముఖ్యమంత్రులు ముద్దాడుతున్నారు. బీజేపీ వాళ్లకు ఏమైనా బుద్ది ఉందా? రాష్ట్రం పంపిన నివేదిక కు కేంద్రమే ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇప్పించింది మీరే కదా. రాష్ట్రం పంపిన నివేదిక తప్పు అయితే…..కేంద్ర మంత్రి వర్గం ఎలా ఆమోదం పలికిందన్నారు రేవంత్.
కెసిఆర్ తప్పు చేస్తే…దానికి మద్దతు చెప్పింది బీజేపీ. కేంద్ర ఆదేశాలు వెనక్కి తీసుకోవచ్చు కదా. జోనల్ విధానం అంతా కేంద్రం చేతిలోనే ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో కెసిఆర్ నిర్ణయాన్ని గుడ్డిగా ఆమోదం తెలిపిన కిషన్ రెడ్డీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బండి..గుండు..ఇద్దరు ఉద్యోగులను మోసం చేస్తున్నారు. కేంద్రంలో అధికారం లో ఉన్నప్పుడే జీఓ 317 పై న్యాయం చేయట్లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తారా..? లెఫ్ట్ నేతలను కెసిఆర్ ఇంటికి పిలిచి డ్రామాలు మొదలు పెట్టారు. కెసిఆర్ బీజేపీ పంజరంలో చిలుక అన్నారు. బీజేపీ మాటలే కెసిఆర్ పలుకుతారు.
మోడీ ఆదేశాలతోనే కెసిఆర్ మాట్లాడుతున్నారు. బీజేపీ..కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కూటమి కట్టాలని కెసిఆర్ కి ఉంటే జగన్ తో మాట్లాడారా. ఎస్పీని కలిశావా.. నవీన్ పట్నాయక్ నీ కలిశావా..? యూపీయేలో ఉన్న డీఎంకే..శరద్ పవార్ నే కలుస్తున్నారు. యూపీయేకి దగ్గర ఉన్న వాళ్ళను దూరం చేసే పనిలో ఉంది. కెసిఆర్ సుఫారీ చేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ లో కెసిఆర్.. సమాజ్ వాదీ పార్టీ కి మద్దతు ఇస్తాడా .? లెఫ్ట్ పార్టీ లు యూపీలో అఖిలేష్ కి మద్దతు ఇస్తున్నాయి. కెసిఆర్ మోడీ షేర్వాణి లో గులాబీ కాకపోతే … యూపీ లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతు పలుకుతావా..? అఖిలేష్ కి ప్రచారం చేస్తావా..? అందుకు సిద్ధంగా ఉన్నావా..?బీజేపీ..టీఆర్ఎస్ ఉమ్మడి డ్రామాలు ఆడి జనాన్ని మభ్యపెడుతున్నారని రేవంత్ విమర్శించారు.
- Tags
- BJP and TRS
- cm kcr
- congress
- modi
- Revanth
తాజావార్తలు
-
NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!
-
Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక
-
Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్‌కు శిక్ష..
-
G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
-
Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!