NTV Telugu Site icon

వైర‌ల్‌: టైగ‌ర్ దెబ్బ‌కు జైలో తుక్కు…

క‌ర్ణాట‌క‌లోని బ‌న్నేర్‌ఘ‌ట్ నేష‌న‌ల్ పార్క్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది.  మైసూరులోని త‌ప్పేకాడ వ‌ద్ద చిరుత‌పులుల ఎన్‌క్లోజ‌ర్ గుండా జైలో ప్ర‌త్యేక వాహ‌నంలో సంద‌ర్శ‌కులు ప్ర‌యాణం చేస్తుండ‌గా, రోడ్డుపై పులుల గుంపు క‌నిపించింది.  వెంట‌నే కారును దారి ప‌క్క‌న పార్క్ చేశారు.  పులుల‌ను వీడియో తీస్తున్నారు. ఈలోగా వెనుక నుంచి ఓ పులి వ‌చ్చి జైలో కారును త‌న ప‌ళ్ల‌తో గట్టిగా ప‌ట్టుకొని వెన‌క్కిలాగే ప్ర‌య‌త్నం చేసింది.  వెన‌క్కి లాగేందుకు చాలాసేపు ప్ర‌య‌త్నం చేసింది.  ఒక‌నోక ద‌శ‌లో ఆ పులి వ‌ల్ల‌కాలేదు.  కానీ, ప‌ట్టువ‌ద‌ల‌కుండా బంప‌ర్‌ను గ‌ట్టిగా ప‌ట్టుకొని వెన‌క్కి లాగేసింది.  దీంతో ఆ జైలో వాహ‌నం కొన్ని మీట‌ర్ల‌మేర వెన‌క్కి వెళ్లింది.  

Read: హైద‌రాబాద్‌లో అందుబాటులోకి కోవిడ్ మాత్ర‌లు…

లోప‌ల ఉన్న టూరిస్టులు భ‌యాందోళ‌నకు గుర‌య్యారు. కారు డ్యామేజ్ అయితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని టూరిస్టులు భావించారు.  కారు వెనక్కి రావ‌డంతో భ‌య‌ప‌డిన ఆ పులి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.  దీంతో టూరిస్టులు ఊపిరిపీల్చుకున్నారు.  దీనికి సంబంధించిన వీడియోను ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.  జైలో కారును పులి కొర‌కడంలో త‌న‌కు ఎలాంటి ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌లేద‌ని, జైలో కారు డెలీషియ‌ష్ గా ఉంటుందని ఆ పులికి కూడా తెలిసిపోయింద‌ని ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.  ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.