తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై స్పందించిన మాజీ టీఎస్‌పీఎస్‌సీ మెంబర్, బీజేపీ నేత విఠల్ మాట్లాడుతూ.. మాజీ టీఎస్‌పీఎస్‌సీ మెంబర్ గా చెప్తున్న, 1 లక్ష 32 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట అబద్ధం అని ఆయన అన్నారు. ఏడేళ్లలో టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేసింది 32 వేల ఉద్యోగాలేనని, కేసిఆర్ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నడని ఆయన ఆరోపించారు.
ఉద్యోగులు నిరుద్యోగులపై కేసీఆర్ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని, 2018లో రాష్ట్ర పతి ఉత్తర్వులు వస్తే ఇప్పటికి వరకు ప్రభుత్వము ఏమీ చేసింది అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు హడావిడి చేస్తూ.. ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఆయన విమర్శించారు.
