Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Telangana Youth Protest In Delhi

ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ యువకుడి నిరసన..

Published Date :December 7, 2021 , 6:38 pm
By Gogikar Sai Krishna
ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ యువకుడి నిరసన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉపరితల గని వలన వ్యవసాయ భూములు కోల్పోయిన తమకు సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించడం లేదని కొంతకాలంగా ప్రజాప్రతినిధులు అధికారులను ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగడం లేదని బాధితుడు సుందర్ తో పాటు కుటుంబం నిరసనలు వ్యక్తి చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని న్యాయం కోసం ప్రధానిని కలిసేందుకు సుందర్ కుమారుడు సంజయ్ ఆరు రోజులు బైక్ పై ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నాడు.

గతంలో ఎడ్లబండి మీద ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లడంతో పాటు సింగరేణి సంస్థ తీరును నిరసిస్తూ సుందర్ కుటుంబం 5 సంవత్సరాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందరికీ విన్నవించినా తమకు న్యాయం జరగడం లేదని ఇటీవల ఇల్లందులో సెల్ టవర్ సైతం సుందర్ ఎక్కాడు. 10 గంటల పాటు సెల్ టవర్ మీద ఉన్న సుందర్ ని కుటుంబ సభ్యులు అధికారులు నచ్చ చెప్పారు. ఆర్డీఓ, సింగరేణి, పోలీస్, రెవెన్యూ అధికారులు అతని సమస్య పరిశీలిస్తామని వివరాలతో రావాలని నచ్చచెప్పి సెల్ టవర్ దింపారు. దాదాపు 1,430 రోజులు నుండి తాము న్యాయ పోరాటం చేస్తు న్యాయం జరగడం లేదని సుందర్‌ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు సుందర్ హైదరాబాద్ సైతం వెళ్లాడు. హైదరాబాదులో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తిప్పి పంపారు. తన తండ్రి సెల్ టవర్ ఎక్కి నప్పుడు తల్లడిల్లిన సుందర్ కుమారుడు సంజయ్ తమ కుటుంబానికి న్యాయం జరగడం లేదని భావించి గత నెల 29వ తేదీన ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు ఢిల్లీ బయలుదేరాడు. ప్రధానమంత్రి ని కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరతానని.. న్యాయం చేయకపోయినా పర్వాలేదు…. చావడానికైనా అనుమతి ఇవ్వండి అంటూ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు.. సింగరేణి సంస్థతో ఒక కుటుంబం కి జరుగుతున్న సమస్య జిల్లా రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి కి వెళ్ళింది. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నష్టపరిహారం ఇతర ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేందుకు భూమి ఇస్తానని అధికారులు మభ్యపెట్టి ఇప్పుడు న్యాయం చేయడం లేదని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Delhi
  • jantar mantar delhi
  • LATEST TELUGU NEWS
  • sundar

తాజావార్తలు

  • US-Iran Talks: “టైమ్‌ పాస్ చేస్తోంది”.. అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..

  • Asha Bhosle : ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై.. మనవరాలు జానై భోస్లే ఏమన్నారంటే?

  • Inter Supplementary Examinations 2026: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచే..

  • Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘హరుడు’!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions