NTV Telugu Site icon

ప్రజల పక్షాన మాట్లాడితే దేశద్రోహి..? బీజేపీ ఏమైనా దేశద్రోహి ఫ్యాక్టరీ పెట్టిందా..?

మరోసారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. వరుసగా రెండోరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దేశంలో నిజాలు మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన మాట్లాడేవారిపై దేశద్రోహిగా ముద్ర వేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహి.. బిల్లులకు పార్లమెంట్‌లో సహాయం కోరినప్పుడు కేసీఆర్‌ దేశద్రోహికాడు..! రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపినప్పుడు కేసీఆర్‌ దేశద్రోహి కాదు..! కానీ, ఎవరు గట్టిగా మాట్లాడినా, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దేశద్రోహి అవుతారని వ్యాఖ్యానించారు కేసీఆర్.. ఇక, బీజేపీ మూడు స్టాంప్‌లను తయారు చేసి పెట్టుకుందన్న తెలంగాణ సీఎం.. ఒకటి దేశద్రోహి, రెండు అర్బన్‌ నక్సలైట్‌, మూడు రూరల్‌ నక్సలైట్‌ అంటూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు దిగారు. మరి, వ్యవసాయ చట్టాలను విమర్శించిన బీజేపీ ఎంపీ వరణ్‌ గాంధీ, మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కూడా దేశ ద్రోహులా అంటూ నిలదీశారు సీఎం కేసీఆర్.