మరోసారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. వరుసగా రెండోరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దేశంలో నిజాలు మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన మాట్లాడేవారిపై దేశద్రోహిగా ముద్ర వేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహి.. బిల్లులకు పార్లమెంట్‌లో సహాయం కోరినప్పుడు కేసీఆర్ దేశద్రోహికాడు..! రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపినప్పుడు కేసీఆర్ దేశద్రోహి కాదు..! కానీ, ఎవరు గట్టిగా మాట్లాడినా, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దేశద్రోహి అవుతారని వ్యాఖ్యానించారు…