యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ముహూర్తం ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి ఆలయ పునః ప్రారంభం ఎప్పుడు అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు… టెంపుల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇలా.. ఎప్పటికప్పుడు భక్తులను కట్టిపడేస్తున్నాయి.. దీంతో.. యాదాద్రి ప్రారంభం ఎప్పుడు.. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేది మరెప్పుడు అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్.. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉటుందని ప్రకటించారు.. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు వెల్లడించిన ఆయన.. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని తెలిపారు.
యాదాద్రి ఆలయాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. యాదాద్రి ఒకప్పుడు మంచి నీళ్లకు కూడా బాధపడ్డ పరిస్థితి.. ఇప్పుడు నృసింహ సాగర్ (బస్వాపూర్ రిజర్వాయర్) నిర్మాణం పూర్తి కావస్తుంది.. గోదావరి జలాలు స్వామివారి పాదాలను స్పృశించనున్నాయి అని వెల్లడించారు.. యాదాద్రికి వస్తే ఉండేందుకు స్థలం లేదని చెప్పేవారు, ప్రసిద్ధ వ్యక్తులు వచ్చినప్పుడు ఉండేందుకు ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మించాం, 250 కాటేజీల నిర్మాణం చేపట్టబోతున్నాం అన్నారు.. ఇక, అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటీ రూపుదిద్దుకుంది, ఆలయ పునర్ ప్రారంభానికి మహా కుంభసంప్రోక్షణం చేపట్టబోతున్నాం, మహా సుదర్శన యాగం చేయబోతున్నాం, యాగం తలపెడితే నిర్విఘ్నంగా సాగాలన్నారు. మరోవైపు, సమైక్య పాలకుల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఆధ్యాత్మికంగా కూడా అన్యాయం జరిగిందన్న ఆయన.. గతంలో పుష్కరాలను కూడా తెలంగాణలో నిర్వహించలేదని గుర్తుచేసుకున్నారు.. ఆధ్యాత్మిక సంపద ఉన్న ప్రాంతం తెలంగాణ. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి గతంలో ప్రాచుర్యం కల్పించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాచుర్యంలోకి తెచ్చామన్నారు.. యాదాద్రి అభివృద్ధికి నాలుగైదేళ్ల క్రితం బీజం వేశాం. మహోత్కష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి. యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టాం. చినజీయర్ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడించారు.. ఇక స్వామివారి విమాన గోపురాన్ని స్వర్ణ తాపడం చేయించబోతున్నాం.. ఇందుకు 125 కిలోల బంగారం అవసరం అన్నారు సీఎం కేసీఆర్.. ప్రతి గ్రామాన్ని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామన్న ఆయన.. మనకు 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో పూజలు చేసి డబ్బు ఇస్తే ఆర్బీఐ నుంచి బంగారం కొంటాం అన్నారు.. ఈ సందర్భంగా యాదాద్రి టెంపుల్‌కు బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్న కొందరు వ్యక్తుల పేర్లను కూడా వెల్లడించారు కేసీఆర్.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?