సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగుతోంది.. మొదటగా కోవిడ్ పరిస్థితిపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తర్ఆత కరోనా కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో వుందని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో వున్నాయని వివరించారు..
మరోవైపు.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 2 కోట్ల పూర్తిచేసిందని.. ఇప్పటివరకు 2 కోట్ల, 56 వేల 159 డోసులు అందించారని వారిలో 1 కోటి 45 లక్షల 19 వేల 909 మొదటి డోసు, 55 లక్షల 36వేల 250 మంది రెండు డోసులు ఇవ్వటం జరిగింది కేబినెట్‌కు వివరించారు అధికారులు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుండి ప్రారంభం అయ్యిందని.. అందరు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని.. ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కేబినెట్ నిర్దేశించింది. ఇక, కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుపై కెబినెట్ సమీక్షించింది.. ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని ఆదేశించింది..
