ఎపి ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగావున్నప్పుడు జరిగిన ఆందోళనలు నిరసనలు కొన్ని ఉద్రిక్త సంఘటనలకు సంబంధించి దాఖలైన 11 కేసులను రద్దుచేయడంపై హైకోర్టు జడ్జి కె.లలిత సుమోటాగా విచారణ చేపట్టడం ఇప్పుడు తాజా వివాదంగా వుంది. ప్రభుత్వాలు మారినపుడు అంతకు ముందరి సాధారణ కేసులు కొన్ని రద్దు చేయడం జరుగుతుంటుంది.వాటినిప్రతిపక్షం ఆక్షేపించడం కూడా జరుగుతుంటుంది గాని ఇక్కడ హైకోర్టు సుమోలాగా తనకు తాను తీసుకోవడవంపైనే ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది.ఈ కేసుల రద్దులో కొన్ని ప్రభుత్వ జీవోల ద్వారానూ…