Site icon NTV Telugu

హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత..

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్‌ హీరో నాని తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.. ఏపీ మంత్రులు.. హీరో నానిపై కౌంటర్‌ ఎటాక్ చేస్తుంటే.. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాత్రం ఆయనకు బాసటగా నిలిచారు.. టిక్కెట్‌ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత… హీరో నానికి థాంక్స్‌ చెబుతున్నాను.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని వ్యాఖ్యానించారు.. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్న అనిత.. ఈ ప్రభుత్వ విధానాలతో మాకు సంబంధం లేదనుకున్నారో.. భయపడ్డారో.. కానీ, సినిమా వాళ్లు స్పందించలేదని.. సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు సెగ తాకింది కాబట్టి.. ఇప్పటికైనా హీరో నాని వంటి వారు స్పందించినందుకు థాంక్స్‌ అన్నారు.

https://ntvtelugu.com/congress-mlc-jeevan-reddy-fires-on-central-and-state-government-over-paddy-procurements-issue/

ఇక, రాష్ట్రంలో పెట్రోల్‌ ధరలకు తగ్గించరు.. నిత్యావసరాల వస్తువుల ధరలను తగ్గించరు.. కానీ, ఈ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను మాత్రం తగ్గించింది అంటూ సెటైర్లు వేశారు అనిత.. సినిమా టిక్కెట్‌ ధరలు తగ్గించి ప్రజలను ఉద్దరించామని ప్రభుత్వం చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.. మద్యం ధరలు తగ్గించి పాలాభిషేకాలు చేయించుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం.. ప్రభుత్వం తీరుపై హీరో నాని నోరు తెరిచి స్పందించినందుకు చాలా థాంక్స్‌ అన్నారు. హీరో నానితో పాటు.. మిగిలిన వారు కూడా సినీ ఇండస్ట్రీ సమస్యల మీదే కాకుండా ఇతర సమస్యలపై స్పందించాలని కోరారు.. సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు కదా..? ప్రభుత్వం తీరును నాని తప్పుపట్టారని.. వైసీపీ విమర్శిస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు.. హీరో నాని తల్లి గురించి మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కౌంటర్‌ ఎటాక్ చేశారు. నిన్నో.. మొన్నో బొత్స సత్యనారాయణ.. అశోక్‌ గజపతి రాజు తల్లి గురించి ఏదో మాట్లాడారు కదా? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత.

Exit mobile version