అజ్ఞాతంలో టీడీపీ నేత పట్టాభి.. వీడియో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన టీడీపీ నేత పట్టాభిరామ్.. సీఎం వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అరెస్ట్ కావడం, జైలుకు పోవడం.. బెయిల్‌పై విడుదల కావడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఎక్కడున్నారు అనేది తెలియదు. ఇదే సమయంలో.. ఆయన మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు రచ్చ చేశాయి.. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన పట్టాభి.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మాలే వెళ్లారని ప్రచారం జరిగింది. కాగా, ఓ వీడియో విడుదల చేసిన పట్టాభి.. అన్ని పుకార్లకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
Read Also : ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. మరోసారి హస్తినకు వెళ్లాలని నిర్ణయం..!
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
తాను కుటుంబంతో కలిసి బయటకి వచ్చా.. అతి త్వరలో మళ్లీ నేను వచ్చి నా విధి నేను నిర్వహిస్తానంటూ వీడియోలో పేర్కొన్నారు.. తప్పుడు కేసులకు నేను భయపడను అంటూ స్పష్టం చేసిన ఆయన.. నా ఇంటి పై వైసీపీ నేతలు జరిపిన దాడిలో నా కుమార్తె భయ బ్రాంతులకు గురైంది.. ఒక తండ్రిగా నా కుమార్తె బాధ్యత నేను నిర్వర్తిస్తా.. నా కుమార్తె, నా భార్యతో నేను బయటకెళ్తే అనేక అర్ధాలు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్న పట్టాభి.. తన ఇంటిపై దాడి, అనంతరం పరిణామాలపై స్పందించారు. పార్టీ జెండాలు బ్యాక్ గ్రౌండ్లో కనపడేలా కూర్చుని వీడియో చేశారు.. కష్ట కాలంలో తనకు మద్దతుఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. ఇక, జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.. అయితే, తాను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు పట్టాభి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు