ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్ ప్రభుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించలేదు. తాలిబన్‌లకు మిత్రులుగా ఉన్న పాక్, చైనాలు కూడా అధికారికంగా గుర్తించలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 22 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుండగా, మరో 36 శాతం మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ లు అధికారంలోకి వస్తే పాక్ ప్రాభల్యం పెరుగుతుందని, ఇది పోరుగునున్న భారత్‌కు ఇబ్బందికరమని, ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులకు, అభివృద్ది పనులకు విఘాతం కలుగుతుందని నిపుణులు ఆందోళన చెందారు.
Read: దక్షిణాఫ్రికాను కుదిపేస్తున్న ఒమిక్రాన్… మళ్లీ ఆంక్షలు మొదలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్, ఇరాన్ దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చాబహార్ రేవు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. అగస్ట్ 31 వ తేదీన ఈ పనులు ఆగిపోగా, ఖతర్‌లోని భారత రాయబారి దీపక్ మిత్తల్, తాలిబన్ ప్రతినిధి మహమూద్ అబ్బాస్‌తో చర్చలు జరిపారు. దీంతో ఆగస్ట్ 31 న మూతబడిన చాబహార్ రేవు తిరిగి సెప్టెంబర్ 2 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఇది పాక్ కు గట్టి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే పాక్‌లోని గ్వాదర్‌లో చైనా, పాక్ కలిసి సంయుక్తంగా నిర్మించిన రేవు వలన చాబహార్ రేవు ఇబ్బంది ఎదుర్కొంటుందని భావించారు. అయితే, తాలిబన్లకు పాక్ కంటే భారత్ అవసరాలే అధికం. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టింది. పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇది ఆ దేశానికి, ఆ దేశ ప్రజలకు చాలా ఉపయోగం. పాక్ కంటే ఇప్పుడు తాలిబన్‌లు భారత్, రష్యా, ఇరాన్ దేశాలకు ఎక్కువ విలువ ఇస్తోంది.
