విమానంలో చీమ‌లు…హాలీవుడ్ సినిమాను త‌ల‌పించిన సీన్‌…

హాలీవుడ్ లో యాంట్స్ అనే సినిమా వ‌చ్చింది గుర్తుంది క‌దా.  ఆ సినిమాలో విమానం ప్ర‌యాణం చేస్తుండ‌గా భ‌యాన‌క‌మైన చీమ‌లు దాడులు చేస్తాయి.  విమానం లోప‌ల జ‌రిగే ఆ సీన్స్ నిజంగా త‌ల‌చుకుంటేనే భ‌యం వేస్తుంది.  ఇలాంటి సంఘ‌టనే న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జ‌రిగింది.  ఢిల్లీ నుంచి ఏఐ111 విమానం లండ‌న్‌కు వెళ్లాల్సి ఉన్న‌ది.  మొత్తం 248 ప్ర‌యాణికుల‌తో టెకాఫ్ కావ‌డానికి సిద్దంగా ఉన్న‌ది.  అందులో భూటాన్ యువ‌రాజు కుడా ఉన్నారు.  ఉన్న‌ట్టుండి బిజినెస్ క్లాస్‌లోనుంచి ప్ర‌యాణికులు పెద్ద ఎత్తున కేక‌లు వేశారు.  సిబ్బంది వెళ్లి చూడ‌గా విమానంలో పెద్ద పెద్ద గండు చీమ‌లు క‌నిపించాయి.  వెంటనే సిబ్బంది ఎయిర్‌పోర్ట్ అధికారుల‌కు స‌మాచారం అందించి ప్ర‌యాణికుల‌ను కింద‌కు దించేశారు.  అక్క‌డి నుంచి మ‌రో విమానంలో ప్ర‌యాణికుల‌ను లండ‌న్ పంపించారు.  

Read: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు: అయోధ్య నుంచి ఎంఐఎం ప్ర‌చారం…

Related Articles

Latest Articles

-Advertisement-