వెరీ ఫన్నీ…. పెన్సిల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఇంట్లో విలువైన వస్తువులు పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ కర్నూలు జిల్లాలో విచిత్రం చోటుచేసుకుంది. తన పెన్సిల్ పోయిందంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో ఈ ఘటన జరిగింది. హన్మంతు అనే బాలుడు తన పెన్సిల్‌ను తోటి విద్యార్థులు దొంగతనం చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పెన్సిల్‌ను దొంగతనం చేసిన విద్యార్థిపై కేసు పెట్టాలని పోలీసులను కోరాడు.
Read Also: ఇంగ్లీష్ మాట్లాడుతున్న మహిళా బెగ్గర్… ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు
Also Read
అయితే చిన్నారి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లవాడిని కూడా పిలిపించారు. మరెప్పుడూ ఇలా చేయకూడదని హితవు పలికారు. దీంతో ఈ విషయంపై కేసు వద్దంటూ పోలీసులు హనుమంతుకు సర్దిచెప్పడం ఫన్నీగా ఉంది. ‘ఈ ఒక్కసారి రాజీ అవ్వురా, బెయిల్ దొరకడం కష్టం అవుతుంది’ అని హన్మంతుకు పోలీసులు నచ్చచెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కూడా స్పందించారు. ఇది నూతన రాయలసీమ అంటూ ట్యాగ్‌లైన్ పెట్టి ఈ వీడియోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇది నూతన #రాయలసీమ !
పెన్సిల్ పోయిందని కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు !😂 pic.twitter.com/HjDi7BoDO6
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 25, 2021
తాజావార్తలు
-
Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!