ఇంగ్లీష్ మాట్లాడుతున్న మహిళా బెగ్గర్… ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు

వారణాసిలోని వీధుల్లో అడుక్కుంటున్న ఓ మహిళ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది. ఆమె పేరు స్వాతి. ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న దుకాణం వద్ద టిఫిన్ చేస్తూ స్వాతి ఇంగ్లీష్ మాట్లాడటాన్ని గుర్తించాడు. దీంతో అతడు స్వాతి గురించి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. దీంతో అతడు స్వాతిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోలను 78వేల మంది వీక్షించారు. స్వాతి సైన్స్ గ్రాడ్యుయేట్ అని చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: రాయి అత‌ని జీవితాన్ని మార్చేసింది

స్వాతి తన వ్యక్తిగత విషయాలను రోడ్డుపై టిఫిన్ చేస్తున్న వ్యక్తితో పంచుకుంది. స్వాతికి వివాహమైన అనంతరం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత ఆమె పక్షవాతం బారిన పడింది. తాను దక్షిణ భారత దేశం నుంచి మూడేళ్ల క్రితం వారణాసికి వచ్చినట్లు స్వాతి వెల్లడించింది. అయితే ఆరోగ్యం బాగోలేకపోవడం, శరీరం సహకరించకపోవడంతో వీధుల్లో అడుక్కుంటున్నట్లు వివరించింది. దీంతో ఆమెకు ఆర్థిక సహాయం అవసరం అని, సైన్స్ చదివిన ఆమెకు మంచి ఉద్యోగం ఇస్తే ఆమె తన కెరీర్‌లో నిలదొక్కుకుంటుందని వీడియో తీసిన వ్యక్తి అభిప్రాయపడ్డాడు. టైపింగ్, కంప్యూటర్‌కు సంబంధించిన పనులు చేయగలదని చెప్పడంతో పలువురు నెటిజన్లు ఈ వీడియో చూసి పలు రకాల కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CWqpFI1B3Ru/?utm_medium=copy_link

Related Articles

Latest Articles