NTV Telugu Site icon

వెరీ ఫన్నీ…. పెన్సిల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి

సాధారణంగా ఇంట్లో విలువైన వస్తువులు పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ కర్నూలు జిల్లాలో విచిత్రం చోటుచేసుకుంది. తన పెన్సిల్ పోయిందంటూ ఓ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో ఈ ఘటన జరిగింది. హన్మంతు అనే బాలుడు తన పెన్సిల్‌ను తోటి విద్యార్థులు దొంగతనం చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన పెన్సిల్‌ను దొంగతనం చేసిన విద్యార్థిపై కేసు పెట్టాలని పోలీసులను కోరాడు.

Read Also: ఇంగ్లీష్ మాట్లాడుతున్న మహిళా బెగ్గర్… ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు

అయితే చిన్నారి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లవాడిని కూడా పిలిపించారు. మరెప్పుడూ ఇలా చేయకూడదని హితవు పలికారు. దీంతో ఈ విషయంపై కేసు వద్దంటూ పోలీసులు హనుమంతుకు సర్దిచెప్పడం ఫన్నీగా ఉంది. ‘ఈ ఒక్కసారి రాజీ అవ్వురా, బెయిల్ దొరకడం కష్టం అవుతుంది’ అని హన్మంతుకు పోలీసులు నచ్చచెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కూడా స్పందించారు. ఇది నూతన రాయలసీమ అంటూ ట్యాగ్‌లైన్ పెట్టి ఈ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.