NTV Telugu Site icon

కరోనా ఎఫెక్ట్‌.. కరీంనగర్‌లో కఠిన ఆంక్షలు..

Karimnagar

Karimnagar

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలోనే కేసులు వెలుగుచూస్తున్నాయి… నిన్నటి బులెటిన్‌లో జీహెచ్‌ఎంసీలో కంటే.. కరీంనగర్‌లోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవుతోంది… జిల్లాలో కరోనా ఉధృతిపై మీడియాతో మాట్లాడిన కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్… కోవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. అంతా తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్క్‌ ధరించాలని స్పష్టం చేశారు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే టెస్ట్ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు కలెక్టర్‌. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో టెస్టులు అందుబాటులో ఉంటాయన్న ఆయన.. టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన ఐదుగురుతో ఐసోలేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇక, రేపటి నుండి కరోనా కట్టడికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని.. మాస్క్, డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని తెలిపారు సీపీ సత్యనారాయణ.. కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఆయన.. రేపటి నుండి నిర్వహించే స్పెషల్ డ్రైవ్ లో మాస్కులు, డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.. రేపటి నుండి నిర్వహించే స్పెషల్ డ్రైవ్ లో మాస్కులు ధరించని వారిపై వెయ్యి రూపాయలు ఫైన్ విధించబడుతుందన్నారు కలెక్టర్.. స్పెషల్ డ్రైవ్ లో మాస్కులు ధరించని వారిని స్పాట్‌లో టెస్ట్ నిర్వహించి ఐసోలేషన్ కు తరలిస్తామన్నారు.. నిబంధనలను ఉల్లంఘించినవారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తాం అని స్పష్టం చేశారు సీపీ సత్యనారాయణ.