టిక్కెట్ రేట్ల ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ భారీ స్క్రీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని గ్రామీణ ప్రాంతాలలో టిక్కెట్ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో తమకు నష్టాలు వస్తాయని భావిస్తూ యజమానులు పలు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఈ జాబితాలో సౌతి ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్ కూడా చేరింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ‘వి ఎపిక్’ థియేటర్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ థియేటర్లో 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు గల అతి పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఇది సౌతిండియాలోనే అతి పెద్ద భారీ స్క్రీన్. అటు ప్రపంచంలో చూసుకుంటే మూడో భారీ స్క్రీన్ ఇది. ఈ థియేటర్లో 650 సీట్లు ఉంటాయి.
Read Also: తెలంగాణాలో టికెట్ రేట్లపై కొత్త జీవో… కేసీఆర్ కు చిరు థ్యాంక్స్
Also Read
ఈ థియేటర్‌ను ప్రభాస్ ‘సాహో’ సినిమాతో ప్రారంభించారు. అప్పట్లో దీనిని హీరో రామ్‌చరణ్ చేతుల మీదుగా నిర్వాహకులు ప్రారంభించడం జరిగింది. కోట్ల రూపాయలతో ఈ థియేటర్ నిర్మించారు. అయితే ఈ థియేటర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండటం మైనస్‌గా మారింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పరిధిలో టిక్కెట్ రేట్లు రూ.15, రూ.10, రూ.5 ఉండటంతో తమకు ఈ రేట్లు గిట్టవని నిర్వాహకులు థియేటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కాగా టిక్కెట్ల రేట్ల ఇష్యూతో ఇప్పటికే ఏపీలో సుమారు 100 థియేటర్ల వరకు మూతపడినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!