దక్షిణాఫ్రికాలో దారుణ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 10 మందిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున కాల్పుల ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం.
Also Read:Upendra Kushwaha: 2024లోనూ ప్రధాని మోడీకి ఎదురు లేదు.. నితీష్ ప్రయత్నం వృధానే!
ప్రపంచంలోనే అత్యధికంగా మరణించిన దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. దక్షిణాఫ్రికాలో ఇటీవలి కాలంలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. గత జనవరిలో, దక్షిణాఫ్రికాలోని దక్షిణ తీర పట్టణంలో పుట్టినరోజు వేడుకలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే విధంగా గతేడాది మద్యం దుకాణంలో జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు.