Rare Love Marriage: అరుదైన ప్రేమ పెళ్లి. ఆన్ లైన్ వివాహానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rare Love Marriage: పెళ్లిళ్లు పలు రకాలు. ఈమధ్య వింత వివాహమొకటి జరిగింది. ఓ అమ్మాయి తననుతానే మనువాడింది. సోలో బతుకే సో బెటర్ అన్నట్లు ఈ సోలో మ్యారేజ్ అప్పట్లో బాగా వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఓ అరుదైన పెళ్లికి తెర లేవబోతోంది. ఇది ఆన్‌లైన్ మ్యారేజ్. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అమ్మాయి ఇండియాలో ఉంది. వాళ్లిద్దరూ వర్చువల్‌గా ఒక్కటవుతారన్నమాట. దీనికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. తద్వారా ఆ జంటకు పరోక్షంగా ప్రి-వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చింది.
తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన వంశీ సుదర్శిని అనే అమ్మాయి, అమెరికాకు చెందిన రాహుల్ ఎల్ మధు అనే అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం అతను అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు. తామిద్దరం వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అంటూ ఈ ఏడాది మే 5వ తేదీన మనవలకురిచి అనే ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉమ్మడిగా దరఖాస్తు సమర్పించారు. ప్రత్యేక వివాహ చట్టం-1954లోని సెక్షన్-5(వివాహ ఉద్దేశ ముందస్తు సమాచారం) మేరకు అప్లికేషన్ ఇచ్చారు. వారం రోజుల తర్వాత దీనికి సంబంధించిన నోటీసునూ ప్రచురించారు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
President’s flag: ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ అంటే ఏంటి?. రేపు తమిళనాడు పోలీసులకు ఇవ్వనున్న వెంకయ్యనాయుడు
తద్వారా తాము భార్యాభర్తలం కాబోతున్నామని బహిరంగంగా ప్రకటించారు. నిబంధనల ప్రకారం నెల రోజులాగి చట్టబద్ధంగా ఒక్కటయ్యేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లారు. కానీ అధికారి ఆ పెళ్లి జరపలేదు. ఎందుకు? ఏమిటి? అనేది తెలియదు. దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. పెళ్లి నిమిత్తం ఇండియాలో ఉండేందుకు తీసుకున్న అనుమతి గడువు ముగుస్తుండటంతో అతను తిరిగి అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అమ్మాయి హైకోర్టులో పిటిషన్ వేసింది. వర్చువల్ మ్యారేజ్‌కి పర్మిషన్ ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ జీఆర్ స్వామినాథన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ చేసిన తప్పిదానికి ఆ జంట శిక్ష అనుభవించకూడదని అన్నారు. పెళ్లి అనేది మనిషి ప్రాథమిక హక్కు అని, ప్రత్యేక విహహ చట్టం, పౌర-రాజకీయ హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన దీనికి అనుకూలంగా విధివిధానాలను రూపొందించాయని చెప్పారు. పెళ్లి ఎలా చేసుకోవాలనేది వ్యక్తుల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని, ఈ కేసులో వీళ్లిద్దరూ ఆన్‌లైన్ పద్ధతిని ఎంచుకున్నారని, టెక్నాలజీకి అనుగుణంగా చట్టం కూడా మారాలని తెలిపారు.
పిటిషనర్ కోరినట్లు వర్చువల్‌గా పెళ్లి చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వరుడు రాహుల్‌కి వధువు వంశీ పవరాఫ్ అటార్నీ కాబట్టి ఆమె అతని తరఫున మ్యారేజ్ సర్టిఫికెట్ బుక్‌లో సంతకం చేయొచ్చని స్పష్టం చేశారు. ముగ్గురు సాక్షుల సమక్షంలో చట్టం ప్రకారం పెళ్లి జరిపించి ఆమెకు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. పెళ్లి కార్డు లేని ఈ ప్రేమ వివాహానికి మొత్తమ్మీద శుభం కార్డు పడింది.
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!