తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
Also Read:Bansuri Swaraj: రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె.. బీజేపీలో కీలక పదవిలో నియామకం
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మంగళవారం ఒకటి రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది.
Also Read:Bilkis Bano Case: బిల్కిస్ బానో పిటిషన్‌పై సుప్రీం విచారణ.. కేంద్రం, గుజరాత్ సర్కారుకు నోటీసులు
ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, ఆగ్నేయ దిశ నుంచి గంటకు 04 నుంచి 08 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం హకీంపేటలో 5.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లో 2.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతల విషయానికొస్తే రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉంది. నిజామాబాద్ గరిష్టం 36.7, గరిష్టం 24.3, నల్గొండ గరిష్టం 34.5, కనిష్టంగా 20.0, మెదక్ 35.8, కనిష్టంగా 21.0, మహబూబ్ నగర్, గరిష్టంగా 36 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యాయి.
Also Read:Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)
మరోవైపు గత కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నీటమునిగాయి. వడగళ్లు, ఈదురు గాలులతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మామిడి, మిర్చి, మొక్కజోన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.28లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మొక్కజొన్న, మిర్చి వేసిన చాలా మంది అన్నదాతలు చాలా వరకు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలోనే ఆకాల వర్షాలతో పంట నష్టం జరిగిన జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. బాధిత రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ సాయాన్ని కూడా ప్రకటించారు.