పంజాబ్ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. నిన్న సాయంత్రం వరకు ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుందని అనుకున్నా, సిద్ధూ పేరును తెరపైకీ తీసుకొస్తే పూర్తిగా వ్యతిరేకిస్తానని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పడంతో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎవర్ని ఎన్నుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెరపైకి అనేకమంది పేర్లు వస్తున్నాయి. మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, ప్రతాప్ సింగ్ బజ్వా, సుఖ్ సిందర్ సింగ్ రంధ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌల్ భట్టల్ పేర్లు తెరమీదకు వచ్చాయి. వీరితో పాటుగా సిద్ధూపేరు కూడా తెరమీదకు తీసుకొచ్చారు. ఎవర్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అన్నది ఈ మధ్యాహ్నం వరకు క్లారీటీ వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఆలస్యం చేస్తే పాలనా పరమైన ఇబ్బందులతో పాటుగా పోటీ పెరిగే అవకాశం ఉంటుందని, ఈ మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి ఎవరూ అన్నది తేల్చేస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది.
Read: షాకింగ్ పరిశోధన: రూపాంతరం చెందుతున్న వేరియంట్లు… గాలిద్వారా వ్యాప్తి…