తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖరాశారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో పునర్ సమీక్ష చేయాలని లేఖలో కోరారు.. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని లేఖలో ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యేలు.. కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు.. తెలంగాణ సర్కార్ రాసిన లేఖలు వెనక్కి తీసుకోవాలని కోరారు.. అయితే, గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. 2014 పునర్ విభజన చట్టం ప్రకారం అనుమతి ఇచ్చిన ప్రాజెక్టుల్లో వెలిగొండ ఉందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలకు తోడు.. తెలంగాణ ఫిర్యాదుల వల్ల కరువు జిల్లా అయిన ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతి లేదంటున్న తెలంగాణ.. నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులపై ఏం చెబుతుందని ప్రశ్నించారు. కరువు జిల్లాపై కక్ష వద్దని లేఖలో కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. డోలా, ఏలూరి, గొట్టిపాటి.
కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ.. కక్ష వద్దు..!
