ప్రముఖ మలయాళ నటుడు రిజబావా కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళ నటుడు రిజబావా (55) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొచ్చిలోని ప్రైవేట్ హాస్పటిల్ లో కిడ్నీకి సంబంధించిన చికిత్స తీసుకుంటూ ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లలో మలయాళ చిత్రసీమలో గుణచిత్ర నటుడిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించారు రిజబావా.
నాటక రంగం నుండి చిత్రసీమలోకి ఆయన 1984లో ‘విష్ణుపక్షి’ చిత్రంతో అడుగుపెట్టారు. అయితే ఆ మూవీ విడుదల కాలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు ఆయన నటించిన ‘డాక్టర్ పశుపతి’ చిత్రంతో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నారు రిజబావా. ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నటి పార్వతికి జోడీగా ఆయన నటించారు. అదే సంవత్సరం వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీ ‘ఇన్ హరిహర్ నగర్’లో జాన్ హోనై అనే విలన్ పాత్రను పోషించి మెప్పించారు. అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాదాపు 150 చిత్రాలలో నటించిన రిజబావా పలు టీవీ సీరియల్స్ లోనూ చేశారు. చివరగా ఆయన మమ్ముట్టి నటించిన ‘వన్’ చిత్రంలో నటించారు. రిజబావా మృతికి మలయాళ చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.
Also Read
- Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
- Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్‌ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
తాజావార్తలు
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
-
Uttar Pradesh: అసదుద్దీన్ ఓవైసీ లేకుండా అఖిలేష్ సీఎం కావడం కలే!
-
World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!