Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Political Pressure On Karimnagar Police

పార్టీల మధ్య నలుగుతున్న సీపీ

Published Date :January 12, 2022 , 9:36 pm
By NTV WebDesk
పార్టీల మధ్య నలుగుతున్న సీపీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్టీల మధ్య పోలీస్‌ అధికారులు నలిగిపోతున్నారా? బండి సంజయ్‌ ఎపిసోడ్‌ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా? అక్కడ సీపీపై బీజేపీ గురిపెట్టిందా? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి? ఈ అంశంలో టీఆర్‌ఎస్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఎలా కాపాడుతుంది?

సీపీ సత్యనారాయణపై బీజేపీ ఫిర్యాదులు..!
కరీంనగర్‌ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్‌, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్‌ అరెస్ట్‌ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి సంజయ్‌. దీక్షకు అనుమతి లేదని బీజేపీ నాయకులకు ముందే చెప్పామన్నది కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వాదన. అయితే CP కావాలనే దీక్షను అడ్డుకున్నారని ఆరోపిస్తోంది బీజేపీ. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై గతంలో ఉన్న కేసులను తిరగదోడారని కాషాయ పార్టీ మండిపడుతోంది. సీపీ సత్యనారాయణపై పార్లమెంట్ ప్రివిలేజ్‌ కమిటీకి, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు సంజయ్‌.

దీక్ష భగ్నం సందర్భంగా పోలీసుల తీరుపై బీజేపీ గుర్రు..!
గతంలోనూ సీపీ సత్యనారాయణపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు సంజయ్‌. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందితే.. అక్కడే ఉన్న తనపై సీపీ జులుం ప్రదర్శించారన్నది బీజేపీ చీఫ్‌ ఆరోపణ. తాజా ఎపిసోడ్‌లో పోలీసుల తీరు మోతాదు మించిందని కమలనాథులు గుర్రుగా ఉన్నారట. పోలీసులు లాఠీచార్జీతోపాటు మహిళా నాయకులు, కేడర్‌పై దాడులు చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.

రూల్స్‌ ప్రకారమే దీక్ష భగ్నం.. రాజకీయ కోణం లేదన్న సీపీ
దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్‌ తరుణచుగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పినట్టుగా CP ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారాయన. ఈ ఆరోపణలపై స్పందించిన సీపీ సత్యనారాయణ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దీక్షను భగ్నం చేశామని.. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు. అయితే సీపీ సత్యనారాయణపై తప్పకుండా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌ లాంటి నేతలు ప్రకటనలు చేయడం చర్చగా మారింది.

పార్టీల మధ్య గొడవలతో పోలీసులు నలిగిపోతున్నారా?
పాలకవర్గం చెప్పినవి పోలీసు అధికారులు తూచా తప్పకుండా పాటించడం.. పైనుంచి వచ్చే ఆదేశాలతో ఎలా చెప్తే అలా వ్యవహరించడం నిత్యం జరిగేదే. అది అన్ని ప్రభుత్వాల్లోనూ ఉంది. కాకపోతే పొలిటికల్‌ పార్టీల మధ్య గొడవలతో పోలీసులు.. ఇతర అధికారులు నలిగిపోతున్నారని.. డిపార్ట్‌మెంట్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే బీజేపీ ఫిర్యాదుల నుంచి సీపీ సత్యనారాయణను టీఆర్ఎస్‌ సర్కార్‌ ఎలా కాపాడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • BJP vs TRS
  • karimnagar cp
  • karimnagar CP Satyanarayana
  • Telangana CM KCR

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions