Pawan Kalyan: సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటే యూత్ కు పునకాలే.. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇక ఏ రేంజులో హంగామా ఉంటుందో ఊహించుకోవచ్చు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన బ్రో ఈ నెల 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నుంచి విడుదలైన టీజర్, పాటలు ఇప్పటికే పై భారీ అంచనాలు పెంచేశాయి… ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇందులో థమన్ మ్యూజిక్ సిసిమాకు హైలెట్‌గా నిలిచింది. విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదిలో ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు పవన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు హాజరయ్యారు..
మెగా హీరోల స్పీచ్ లతో జనాలను తెగ ఆకట్టుకున్నారు.. వరుణ్ తేజ్ బాబాయ్ కష్టపడుతున్నారు అంటూ అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ తో స్టేజ్ మొత్తం దద్దరిల్లి పోయింది.. పవన్ మాట్లాడుతూ… ఇంత అభిమానం, ప్రేమ ఒక్కోసారి కలా, నిజమా అనిపిస్తుంది. ఇది నేను కోరుకున్న జీవితం కాదు, దేవుడు నాకు ఇచ్చిన జీవితం. చాలా చిన్న జీవితాన్ని గడపాలనుకున్నా, రాజకీయాల్లో కూడా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. అభిమానులపై నాకున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. సమాజానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. బ్రో ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది. కరోనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేశారు. సముద్రఖని గారు చెప్పిన కథను విన్నాను బాగుంటుంది అన్నారు. అభిమానులను దృష్టిలో పెట్టుకొని నేను అభిమానులకు ఎలా నచ్చుతానే అలా నా పాత్రను డిజైన్ చేశారు అంటూ సినిమా పై హైప్ ను క్రియేట్ చేశారు..
Also Read
ఇకపోతే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు..సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన పవన్.. సాయి ధరమ్ తేజ్ ఈ రోజు ఇక్కడ ఉన్నాడంటే దానికి ఆ రోజు ప్రమాద సమయంలో కాపాడిన అబ్దుల్ కారణమని, అతనికి కృతజ్ఞతలు అంటూ పవన్ ఎమోషనల్ అయ్యారు. తేజ్‌ను బయటకు తీసుకొచ్చిన అపోలో, మెడికవర్ ఆసుపత్రి వర్గాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.. అంటూ పవన్ చెప్పడంతో స్టేజ్ మొత్తం పవర్ స్టార్ అని హోరేత్తింది.. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ మాట్లాడారు.. సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
-
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!