చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త : పవన్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై పవన్ గట్టిగానే మండిపడ్డారు. గత రాత్రి జరిగిన “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. “18 శతాబ్దంలో ఫ్రాన్స్ లో వ్యాపారవేత్తలంతా కలిసి ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ తో కూర్చుని వ్యాపారం గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారట. అప్పుడు ట్రేడ్ మినిస్టర్ ప్రభుత్వం తరపున నేను మీకేం చేయగలను చెప్పండి ? అని అన్నాడట. ఆయన అలా గట్టిగా మాట్లాడం చూసిన వ్యాపారవేత్తలు నువ్వేం చేయక్కర్లేదు. మూసుకుని కూర్చో. ప్రభుత్వం ఏమీ చేయకపోతే మా పనులు మేము చేసుకుంటాము. అసలు ప్రభుత్వం కల్పించుకోవద్దు అన్నారట.
Read Also : చిరంజీవికి చెప్పండి… రిక్వెస్ట్ కాదు హక్కు… : పవన్
Also Read
ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు చేస్తే ఈరోజు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తా అంటుందేంటి ? మీరు లాజిక్ ఆలోచించండి. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మోహన్ బాబు గారు… ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెట్టిన రూల్ అంటే కష్టం మేము పడాలి, టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా ! ఓకే… రేప్పొద్దున మోహన్ బాబు విద్యానికేతన్ ది కూడా ఆన్లైన్ లో కలెక్ట్ చేసుకోండి. చిత్ర పరిశ్రమ చాలా చిన్నది అనుకుంటున్నారేమో కాదు. బడ్జెట్ చిన్నదేమో… కానీ ప్రభావం చాలా పెద్దది. ముఖ్యంగా వైసీపీ నేతలకు చెప్తున్నా చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త…” అంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్.
తాజావార్తలు
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!